Download Hanuman Jayanti Story in Telugu PDF
You can download the Hanuman Jayanti Story in Telugu PDF Download for free using the direct download link given at the bottom of this article.
Hanuman Jayanti Story in Telugu
Hanuman Jayanti is a Hindu religious festival that celebrates the birth of Hindu God Hanuman, who is immensely venerated throughout India and Nepal. This festival is celebrated on different days in different parts of India. Lord Hanuman is worshipped as a deity with the ability to attain victory against evil and provide protection. On this auspicious day, devotees of Lord Hanuman celebrate him and seek his protection and blessings. They flock to temples to worship him and present religious offerings. In return, The devotees receive Prasad by the temple priests as sweets, flowers, coconuts, tilak, sacred ash (udi) and Ganga jal (holy water). People also celebrate him on this day by reciting various devotional hyms and prayers like the Hanuman Chalisa and reading holy scriptures like the Ramayana and Mahabharata.
శ్లో|| ఆంజనేయం మహావీరం -బ్రహ్మ విష్ణు శివాత్మకం
తరుణార్క ప్రభంశాతం -రామదూతం నమామ్యహం
- ‘బుద్ది మతాం వరిష్టమ్’ జ్ఞాన నిష్ఠ అర్ధగంభీర్య భాషా ప్రవాహము, అమిత రామ భక్తీ ,కార్యనిపుణత కలిగినవాడు హనుమంతుడు. హనుమంతుడు సీత జాడ తెలుసుకుని వచ్చినప్పుడు శ్రీ రాముడు అంటాడు హనుమా నీ అగణిత ఉపకారములు నాపై ఉన్నాయి, అందులకు నా యొక్క ప్రాణమును తీసి ఇచ్చినను తక్కువే అవుతుంది నీ ప్రేమ నాకై పంచ ప్రాణముల కన్నా కుడా ఎక్కువే , ఇందుకు నేను నీకు కేవలం ఆలింగనము ” ఏకైకస్యోపకారస్య ప్రాణాన్ దాస్వామి తే కాపే” నీ లాగ ఎవ్వరు చేయలేరు అని ఆలింగనం చేసునున్నాడు రాముడు. స్వామి భక్తి , గురుభక్తి ,స్నేహశీలి, నమ్మినబంటు, అంతర్భాహ్య శత్రువులను జయించినవాడు ఇలా ఎన్నింటిలోనో హనుమంతుడు ఘనుడు. అందుకే మనం హనుమంతుని జయంతిని జరుపుకుంటాం.
- ఈ జగమందు సప్త చిరంజీవులలో హనుమంతుడు ఒకరు. శ్రీరామ భక్త హనుమంతుని యొక్క జన్మ రహస్యం భక్తులెందరో హనుమంతుణ్ణి ఆదర్శనీయ దైవంగా ఆరాధిస్తారు. అతన్ని మహాబలుడు, బుద్ధిశాలి, కపిశ్రేష్టుడు, సర్వశాస్త్ర పారంగతుడు, స్వామిభక్తి పరాయణుడు, రామదూత అంటూ ఎన్నోవిధాలుగా ప్రస్తుతిస్తారు. తల్లి అంజనాదేవి కనుక వీరిని ఆంజనేయుడంటారు. అతని తండ్రి ఎవరనే విషయంలో శివ మహాపురాణం, రామాయణం, పరాశర సంహిత మొదలైన గ్రంథాల్లోని వైవిధ్య గాథలతో అతడి దివ్య జననం ముడివడి ఉంది. శ్రీ హనుమంతుని యొక్క జన్మ రహస్యం అతని తల్లి అంజన కథతో సంబంధం కలిగి ఉన్నది. హనుమంతుడు అంజన అనే ఆడకోతి మరియు కేసరి అనే పురుషకోతి యొక్క కుమారునిగా జన్మించాడు.
- గతంలో అంజన బ్రహ్మ న్యాయస్థానంలో ఒక అప్సరసలా ఉండేది. ఆమె బాల్యంలో ఒక ముని తపోభంగం కలిగించినందుకు శపించబడింది. ఆమె బాల్యంలో కాళ్ళు ముడుచుకుని ధ్యానం చేసుకుంటున్న కోతిని చూసి ఆశ్చర్యంతో ఉత్సాహభరితంగా చిన్నపిల్ల అయిన అంజన కోతిపైన పండ్లు విసిరింది. హఠాత్తుగా ధ్యానానికి భంగం కలిగిన కోతి రూపంలో ఉన్న ముని నిజరూపం పొంది కోపంతో అంజనను ఆమె ఎవరితోనైన ప్రేమలో పడిన్నప్పుడు కోతిగా మారమని శాపం ఇచ్చాడు. అంజన చేసిన తప్పు తెలుసుకుని ఆ మునిని క్షమాభిక్ష పెట్టమని వేడుకొంది.
- అప్పుడా ముని శాంతపడి ఆమె కోతి రూపంలో ఉన్నా ఆమెను ఎవరైతే ఇష్టపడతారో మరియు శివుని అవతారమైన శిశువుకు ఆమె జన్మ ఇచ్చినప్పుడు ఆమె శాపం నుండి విముక్తి పొందుతుందని వరమిచ్చాడు. అందు వలన శాప విమోచనానికి అంజన భూమి పైన జన్మించింది. అడవిలో నివాసం ఏర్పరచుకున్న అంజన ఒక రోజు ఒక పురుషుడిని చూసింది మరియు ఆమె అతనితో ప్రేమలో పడింది. ఆమె ప్రేమలో పడిన క్షణం నుండి వెంటనే ఆమె కోతి రూపంలోకి మారింది. ఆ మనిషి అంజన వద్దకు వచ్చి తన నామధేయం ‘కేసరి’ అని కోతులకు రాజును అని తనను తాను పరిచయం చేసుకున్నాడు. అంజన కోతి ముఖం కలిగి ఉన్నా అతనిని చూసి ఆశ్చర్యపోయింది.
Hanuman Jayanti Story in Telugu PDF Download Link
[download id=”18854″ template=”dlm-buttons-new-button”]